Yashlyrics007

 

నేల నీరు... వూరు!

 

        ఇరవై అడుగుల వెడల్పు కూడా లేని మట్టి రోడ్డు మీద మెర్సిడెస్ బెంజ్ మెల్లగా కదుల్తొంది.

        చిన్న వూరు. వూరు మధ్యలో మట్టి రోడ్డు పది గంటల ఉదయపు వేళ వూర్లో పల్చగా జనం.... రోడ్డు అంచునే కూర్చుని ప్రపంచంతో సంబంధం లేనట్టు కబుర్లు చెప్పుకుంటూ.......

        ఆశ్చర్యంగా ఉంది జయదేవ్ కి.

        కోటి రూపాయల కారులో వెళుతున్న ఆరొందల ఎకరాల పొలం ఉన్న ఆసామిని కనీసం కన్నెత్తి చూడడం లేదు ఎవరు!

        అది ఆశ్చర్యమే కాదు...... షాకింగ్ గా ఉంది అతనికి.

        రోడ్డుమీద అడ్డదిడ్డంగా పరుగులు పెడుతున్న పిల్లల్ని తప్పించుకుంటూ జాగ్రత్తగా ముందుకు కదులుతోంది మెర్సిడెస్.

        పక్క సీటు వైపు చూశాడు జయదేవ్....

        రకరకాల బిస్కెట్ ప్యాకెట్లు....

        ఏమనుకున్నాడు.... ఏం జరిగింది ?

        ఎన్నో ఏళ్లగా జరుగుతున్న ఆశాభంగమే అది !

        జయదేవ్ ఎస్టేట్ విజిట్ కి వెళ్తున్నాడంటే కారులో స్టాప్ సర్ది పెట్టే రకరకాల   సరంజామాతో పాటు ప్రతిసారి బిస్కెట్లు కూడా ఉంటాయి. పూరి మధ్య మట్టి రోడ్డుమీద నుండి మెల్లగా కదిలే కారునీ.... కారులోని తననీ చూసి పూరి జనాలు దండాలు పెడతారని,  కారు చుట్టూ మూగే పిల్లలు కారుని తనని ఆశ్చర్యంగా చూస్తుంటే అందరికీ బిస్కెట్స్ ప్యాకెట్లు ఇవ్వవచ్చని....

        కానీ ఎప్పటిలా అలాంటివేమీ జరక్కుండానే కారు ఎస్టేట్ గేటు ముందు ఆగింది. గేటు ముందు సిద్ధంగా ఉన్న వాచ్ మెన్ గేట్లు తీరిచాడు. కారు మెల్లగా ముందుకు కదిలింది.

        "సూర్యా వాళ్లు ఇంతేనా ?  ఎప్పటికీ మారరా.... దేనికి రియాక్ట్ అవ్వరా ?  వాళ్లకు తెలీదా.... ఈ కారులో నాలుగైదు నెలలకోసారి వచ్చేది ఈ ఎస్టేట్ యజమాని జయదేవ్ మాత్రమేనని ? వీళ్ళకేనా మనం సహాయం చేయాలని చెబుతున్నావ్ ? 

        ముందు సీట్లో కూర్చున్న సూర్యును చూస్తూ అన్నాడు జయదేవ్....

        సూర్య ఏమీ మాట్లాడలేదు.

         కారు రెండు మూడు నిమిషాల ప్రయాణం తర్వాత ముందు ఆగింది. పెద్ద బంగాళా.... అరొందల ఎకరాల మధ్యలో ,  పది అడుగుల ఎత్తు మీద కట్టిన పదివేల చదరపు అడుగుల బంగాళా....  తెల్లగా తళతళలాడిపోతూ తివిగా పాఠశాల ఠీవిగా  ఉంది. ఆ మెట్లు ఎక్కి.... పది అడుగుల ఎత్తు ఉండే గుమ్మం ముందుకు వెళ్లాలన్నా....  మామూలు మనుషులకు ఒకలాంటి బిడియం కలుగుతుంది.... అడుగు ముందుకు పడదు.

        ఎస్టేట్లో ఎటు చూసినా పచ్చదనమే.... పండ్లు తోటలు, వరి పొలాలు, చేపల చెరువులు,  ఎర్రచందనం ప్లాంటేషన్.... ఆ బంగళా మూడో అంతస్తు బాల్కనీ లోంచి చూస్తే కనుచూపు మేర పరుచుకున్న పచ్చదనం పరవాళ్ళు తొక్కే నీటి ప్రవాహం... అరోందల ఎకరాలు ఎస్టేట్ చుట్టు పచ్చగా పాతిక  ముప్పై అడుగుల ఎత్తున పెరిగిన తాటి చెట్లు పచ్చని గోడల.... కనులకు విందులా.... హాయిగా ఉంటాయి. సంవత్సరానికి తను చేసే వంద కోట్ల టర్నోవర్  ఉండే వ్యాపారం కంటే ఈ ఆకుపచ్చని ద్వీపాన్ని.... దీని చుట్టూ రక్షణ కవచంల పెరిగిన గ్రీన్ వాల్ ను చూస్తుంటే జయదేవ్ గర్వంగా ఉంటుంది. అంతకుమించి ఈ ఎస్టేట్ తన అభిరుచికి, శక్తి సామర్థ్యాలకు ప్రతికలా అనిపిస్తుంది. కారులోంచి దిగి బంగళా ముందు పనస చెట్టు కింద కేన్ కుర్చీలో కూర్చున్న జయదేవ్ కి ట్రే లో స్ట్రా పెట్టిన రెండు కొబ్బరి బొండాలు తెచ్చి ఇచ్చాడు వంట మనిషి. వరుసగా రెండు బండారు తాగేసి....

        " ఇక స్టార్ట్ చేద్దామా సూర్యా...." అంటూ పది అడుగుల దూరంలో సిద్ధంగా ఉన్న టాప్ లెస్  జీప్ ముందు సీట్లో కూర్చున్నాడు జయదేవ్.

        వెనక సీట్లో సూర్య.

        జీపు కదిలింది.

        ఎస్టేట్ లోని ప్రతి యాభై ఎకరాలకి ఒక యూనిట్ గా డెవలప్ చేశాడు. ప్రతి యూనిట్లు లింక్ చేస్తూ వేసిన రోడ్లు, ఆ రోడ్లకు రెండు వైపులా పెరిగిన చందనపు చెట్లు....

        సూర్యా చెబుతున్నాడు.... పెరుగుతున్న తోటలు, వేసిన పంటలు, జరుగుతున్న పనులు...  ఈ నెలలో చేయవలసిన పనులు అన్నిటి గురించి వివరిస్తుండగానే చీఫ్ ఎస్టేట్ బౌండరీ రోడ్డులోకి  వచ్చింది. ఆ రోడ్డు రోడ్డు గ్రీన్ వాళ్లకి, తోటలకు సమాంతరంగా ఉంది ఆరొందల ఎకరాల ఎస్టేట్ ని ఒక్క రౌండ్లో తిప్పి చూపిస్తుంది. ఆ రోడ్డుమీద ప్రయాణం అంటే జయదేవ్ కి చాలా ఇష్టం.

         దాదాపు పాతిక ముప్పై అడుగుల ఎత్తు పెరిగిన తాటి చెట్లు, వాటిని పచ్చగా అల్లుకుపోయిన అడవి జాతి తీగ మొక్కలూ మరి ఎక్కడ చూడలేని, ఆఘ్రాణించలేని పరిమళాలు వెదజల్లే అడవి పూలు.... ఆ పరిమళాలతో సమ్మిళితమయిపోయిన తాటి పళ్ల తీయని పలకరింపు.... వాటికోసం వాలే పక్షుల కేరింతలు.... పూలా చుట్టూ తిరుగుతూ తుమ్మెదలు చేయి సయ్యాటలూ.... తన్మయంతో కళ్ళు మూసుకున్నాడు జయదేవ్.... ఒకలాంటి నిశ్శబ్ద సంగీతాన్ని మనసారా ఆస్వాదిస్తున్నట్లు !

        దాదాపు పది కిలోమీటర్లు ఉంటుంది.

        గ్రీన్ వాల్.

        పదిహేను కిలమీటర్ల వేగంతో మాత్రమే కదిలే జిప్....

        డ్రైవర్ కు తెలుసు.... అంతకుమించి వేగంగా వెళ్లకూడదని....

        అది జయదేవ్ కి స్వర్గపు అంచుల మీద నుంచి చేస్తున్న ప్రయాణంలా ఉంటుంది.

        ఆ ఆనందాన్ని.... ఆ హాయని నెమ్మదిగా, ప్రశాంతంగా ఆస్వాదించడం అతనికి ఇష్టం.

        అందుకే.... అక్కడ,  ఆ రోడ్డుమీద ప్రయాణిస్తున్నప్పుడు జీపు స్పీడ్ కు లిమిట్ ఉంటుంది. ఆ విషయం డ్రైవర్ కే  కాదు.... అందరికీ తెలుసు.... ఆరొందల ఎకరాలు ఎస్టేట్ రెండు చేతులూ జూపి హత్తుకున్నట్లు ఉండే పచ్చని కోట గోడ లాంటి గ్రీన్ వాల్ వెంట సాగే ప్రయాణం జయదేవ్ కి ప్రియాతి ప్రియమైనది !

        దాదాపు గంట తర్వాత జీపు తిరిగి వచ్చి  బంగాళా ముందు ఆగింది. జయదేవ్ జీప్ దిగి బంగాళా లోపలికి వెళ్ళాడు అతడి వెనకే సూర్య కూడా ! అరగంట తర్వాత సూర్య బంగ్లాలోంచి బయటకు వచ్చి పక్కనే వంద గజాల దూరంలో ఉన్న ఎస్టేట్ క్యాంప్ ఆఫీస్ లోకి వెళ్లిపోయాడు.

        జయదేవ్ కి అది లంచ్ టైము.

        ఆ తర్వాత గంట నిద్రపోతాడు. నిద్ర లేచాక టీ తాగుతూ ఎస్టేట్ పేమెంట్స్, అండ్ ఎక్స్పెండిచర్స్ రివ్యూ మీటింగ్ పూర్తి చేస్తాడు. తర్వాత నాలుగు నాలుగున్నర మధ్య తిరిగి ప్రయాణమవుతాడు.

#  #  #  #

        తెల్లవారుజాము నాలుగు గంటలు....

        ఫోన్ మోగింది....

        జయదేవ్ తీసి చూసాడు....

        సూర్య నుంచి.... ఈ సమయంలో....?!

        "సూర్యా.... వాట్ హ్యాపెండ్?"

        " సారీ సర్.... డిస్టర్బ్ చేస్తున్నాను.... మీకు ఒక వీడియో పంపించాను.... చూడండి సర్"

        "ఫస్ట్ టెల్ మీ....  వాట్స్ ది మ్యా"

        " సర్ మన ఎస్టేట్ గ్రీన్ వాల్ కి ఫైర్ ఆక్సిడెంట్ అయింది. కాలిపోతుంది.... సర్ "....

        "వ్వా.... ట్...." బాంబు పెలినంత శబ్దం.... జయదేవ్ నోటివెంట.

        " సూర్యా.... ఏం జరిగింది....?"

        "అవున్సార్.... ఎలా జరిగిందో తెలీదు. రాత్రి పన్నెండు గంటల తర్వాత పక్కవూరి వాళ్లు ఫోన్ చేసి చెప్పారు.... ఎస్టేట్ లో మంటలు కనిపిస్తున్నాయని. మేము వెళుతున్నామని. నేను మా వూరి నుంచి ఎస్టేట్ కి చేరే సరికి రెండు గంటలు పట్టింది."

        " నువ్వు ఎస్టేట్ లో ఉండకుండా మీ వూళ్లో ఎందుకున్నావ్ ?"

        ఒక్క క్షణం మౌనం....

        తర్వాత మెల్లగా చెప్పాడు సూర్యా...

        " బికాజ్.... మీరే చెప్పారు.... ఎస్టేట్ నుంచి వెళ్ళిపొమ్మని.... ఇట్స్ ఓకే సార్.... ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. కానీ గ్రీన్ వాల్ దాదాపు మూడు నాలుగు వందల అడుగుల పొడవునా కాలిపోయింది సార్...."

        "ఇప్పుడెలా  ఉంది?"

        " ప్రస్తుతం మంటలు నెమ్మదిగా కంట్రోల్ అవుతున్నాయి. కానీ ఇంకా వస్తునే ఉన్నాయి. ఊరి జనాలు ఇక్కడే ఉన్నారు. ఫైర్ ఇంజన్స్ కూడా వస్తున్నాయి.... నేను మళ్లీ కాల్ చేస్తాను సార్...."

         సూర్య ఫోన్ కట్ అయింది....

         జయదేవ్ మనసు వికలమైపోయింది....

         తను ఎంతో ఇష్టంగా, పాతికేళ్లుగా ప్రాణప్రదంగా పెంచుకున్న గ్రీన్ వాల్ తగలబడి పోవడం....

        ఎలా.... ఎలా జరిగింది....?

         ఫోన్లో వీడియో చెక్ చేశాడు జయదేవ్....

        ' మైగాడ్....' మంటలు.... ఒక్కసారి  మొహాన్ని తాకినట్టు ఎగిసిపడుతున్నాయి. ట్రాక్టర్ తో తెచ్చిన వాటర్ ట్యాంకర్ కి బిగించిన ఇంజన్స్ తో నీళ్లు జల్లుతున్నారు. మంటలు ఆగి పోగా కమ్ముకుంటుంది. చీకటి.... మంటల స్థానంలో చీక్కటి నల్లని పొగ.... ఏం జరుగుతుందో తెలియనంత దట్టమైన పొగ, ఆ పొగలోంచి ప్రాణాలు కూడా లెక్కచేయకుండా అటు-ఇటు పరుగులు తీస్తున్న పూరి జనాలు.... పిల్లా - పెద్దలు.... అంతా అక్కడే ఉన్నట్టున్నారు....

        రెండు నిమిషాల వీడియో

        ఇంకా చూడలేక ఆఫ్ చేసి బెడ్ రూమ్ లోంచి బాల్కనీలోకి వచ్చాడు.

        అప్పుడే నిద్రలోంచి వొళ్ళు విరుచుకుంటూ లేచిన నగరపు రోడ్లమీద ట్రాఫిక్ పెరుగుతుంది.

        ఆస్థిమితంగా ఉంది.

        తిరిగి లోపలికి వచ్చాడు.

        ఇంట్లో ఎవ్వరూ లేరు... వెకేషన్స్ కి లండన్ వెళ్లారు.

         తలనొప్పిగా అనిపిస్తుంది జయదేవ్ కి. వంట మనిషి కూడా నిద్రలేచినట్లు లేదు. కిచెన్లోకి వెళ్లి కాఫీ కలుపుకొని తిరిగి బాల్కనికిలోకి వచ్చాడు....

        'ఎలా జరిగింది....' జయదేవ్ లో అసహనం మళ్ళీ వీడియో ఆన్ చేశాడు.... మంటలు.... మంటలు.... కళ్ళముందు నుంచి గుండెల్లోకి వెళ్లిపోయి హృదయాంతరాల్లో అపురూపంగా అల్లుకున్న పొదరింటిని దగ్ధం చేస్తున్నంత మంటలు అనిపిస్తున్నాయి. భరించలేక వీడియో ఆఫ్ చేసి.... కాఫీ కప్పు చేతిలోకి తీసుకున్నాడు....

        "ప్చ్...." చల్లారి పోయింది

        టైము ఆరయింది.

        మళ్లీ ఫోన్ మోగింది....

        సూర్య నుంచి వస్తున్న కాల్ అది....

         మంటలు కంట్రోల్ అయ్యాయని, ఆ ఊరి వాళ్ళు నాలుగురైదుగురికి చేతులూ కాళ్లు కాలాయని... వాళ్లను హాస్పిటల్  కు తీసుకు వెళుతున్నానని.... తిరిగి సాయంత్రం కాల్ చేస్తారని.... ఫోన్ సారాంశం!

        కానీ చివర్లో....

        " సర్ మన ఎస్టేట్ పక్కన ఆ ఊరే లేకపోతే ఈరోజు మీకిష్టమైన గ్రీన్ వాల్ ఈ మాత్రం కూడా మిగిలేది కాదు. వాళ్ళందరికీ మీరంటే గౌరవం.... మీ అభిరుచిపట్ల గౌరవం....  వాళ్ళకు మనం కల్పిస్తున్న ఉపాధి పట్ల కృతజ్ఞత.... ఇవన్నీ కలిసి ఇవాళ మన ఎస్టేట్ ని రక్షించాయి సార్...."

        ఇంకేదో చెబుతున్నాడు సూర్యా....

         జయదేవ్ కి వినిపించడం లేదు. ఫోన్ కట్ అయింది. మెల్లగా ఆఫీసు రూమ్ లోకి వచ్చి లాప్ టాప్ ఆన్ చేశాడు.... పది రోజుల క్రితం సూర్యా పంపించిన మెయిల్ కోసం....

                                                                               #  #  #  #

        సర్ నేనిక్కడ పదిహేను సంవత్సరాలుగా పని చేస్తున్నాను. అంతకు ముందు పదేళ్లుగా ఎస్టేట్ డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ప్రతి మొక్క ఎదుగుదల వెనక మీ అభిరుచి, కృషి.... ప్లానింగ్ ఎంత ఉన్నాయో.... ఈ వూరి ప్రజల శ్రమ కూడా అంతే ఉంది సర్.

        కచ్చితంగా వాళ్ళు చేసిన పనికి.... ప్రతి క్షణానికి మనం డబ్బు ఇచ్చాం. బహుశా పది పైసలు ఎక్కువే ఇచ్చి ఉంటాం.... దీంట్లో మరో మాటకి అభిప్రాయానికి ఆస్కారమే లేదు. కానీ మనం ఎస్టేట్ ని ఎంత ఇష్టంగా ప్రాణప్రదంగా డెవలప్ చేస్తున్నామో, మన ఇష్టాలకి మన ప్రయారిటీస్ కి వాళ్లు అంతే గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవానికి మనం ఏం చేస్తున్నాం సర్....?

        వాళ్లకీ మనకీ మధ్య పని - జీతం ఈ రెండేనా? మనుషుల్ని  కలిపే బంధం వేరే ఏమీ వొద్ద...

        లేదా ?

        మీరు వచ్చిన ప్రతిసారి కారులో మీ పక్క సీటు నిండా పెట్టుకుని బిస్కెట్లో.... స్వీట్లు.... తెస్తారు. అవన్నీ మీతో పాటే వస్తాయి.... సాయంత్రం మీతో పాటు వెళ్లిపోతాయి....

         ఇది 15 ఏళ్లుగా జరుగుతున్న కథ !

        ఎందుకు సర్.... ఇలా ?

        ఎప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోలేదా ?

        మీరు వాళ్ళ నుంచి పని ఒక్కటే కాదు, మీరు జీవితంలో అధిరోహించిన విజయ శిఖరాలనీ.... మీ స్థాయినీ.... అంతస్తునీ  గుర్తించాలనీ మీ అంతరాంతరాల్లో బలీయమయిన కోరిక....

        మీ కోరిక ఎప్పుడు తీరుతుంది సర్....?

        ఇది మనది.... జయదేవ్ గారు మన మనిషి అనుకున్నప్పుడే జరుగుతుంది.

        మీ సంతోషం - సుఖం వారికి కూడా అయినప్పుడే జరుగుతుంది....

        ఒక్క విషయం మీరు గమనించారా సర్....

         మీరు నేలను ప్రేమిస్తారు నీటిని ప్రేమిస్తారు మొక్కల్ని ప్రేమిస్తారు కానీ మనుషుల్ని ప్రేమించడం మర్చిపోతున్నారు విధ్వంసం అవుతున్న మానవ సంబంధాల్ని విస్మరిస్తున్నారు మనుషుల్ని ప్రేమించడం ప్రారంభించడం జరిగింది సార్. మీ సంతోషం వేయంతలవుతుంది దానికోసం మనం మన జీవితాల్ని త్యాగం చేయవలసిన అవసరం లేదు సార్ మనం ఈ ఎస్టేట్ నుండి సంవత్సరానికి 10 కోట్లు సంపాదిస్తున్నాం దాంట్లో నుంచి పది శాతం పోనీ ఐదు శాతం లేదా మీకు నచ్చినంత ఈ ఊరి కోసం ఈ మనుషుల కోసం ఆలోచించండి సార్ నేను నా పరిధికి మించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తే దయచేసి క్షమించండి

                                                                    #  #  #  #

        జయదేవ్ చదవడం ఆపేశాడు.

        ఇంకా మిగిలిపోయిన అక్షరాలు వెంట కళ్లు కారటం లేదు...

         మనసంతా శూన్యంగా అయిపోయింది....

         దాదాపు 60 ఏళ్ల వయస్సు....

        తన కంటే 20 ఏళ్ల చిన్నవాడు ప్రశ్నించిన విధానం....

         ఎక్కడో శూన్యంలో వేలాడదీసిన ప్రశ్న ల సారాఘాతాలతో వెలువల్లాడిపోయేలా చేస్తున్న భావన....

         నిజమేనా.... సంతోషమంటే నేనొక్కణ్నే సుఖంగా ఉండటం వల్ల కలిగేది కాదా....?

        నా వ్యక్తిగత సుఖమే సంతోషం కాదా....?

        పంచుకోవడంలో అది పదింతలు అవుతుందా ?

        జయదేవ్ మథనం !

         దాదాపు పాతిక సంవత్సరాల క్రితం వెదికి - వెదికి కొన్న భూమి ఇది. దారీ డొంకా లేదు. ఇప్పటికీ అంతే.... దగ్గరలోని టౌన్ నుంచి మొదలయ్యే మట్టిరోడ్డు.... అక్కడి నుంచి పాతిక కిలోమీటర్లు ప్రయాణిస్తే గాని పొలం రాదు. ఆ పొలం పక్కనే చిన్న ఊరు దాదాపు 30 40 మంది రైతుల దగ్గర్నుంచి కొన్ని 600 ఎకరాల ఎస్టేట్ ని డెవలప్ చేశాడు.

        కొనే ముందు ఇంటా - బయటా అంతా వ్యతిరేకించారు.

        ' ఏ సౌకర్యాలూ లేక ఆ వూరే కాళీ అయిపోతుంది.... అక్కడికి మీరు వెళ్లి ఏం చేస్తారని....  'నాకు కావలసింది అదే.... ఎలాంటి సౌకర్యాలు లేని వూరు కాబట్టి భూమి అంతా తక్కువ ధరకు వస్తోంది...' అంటూ ఎవ్వరి మాట వినకుండా కొనేశాడు.

        పుష్కలంగా నీళ్లు ఉన్నాయి....

        మంచి నీళ్లలో కొర్రమీను పెంచారు....

        అక్కడ పండించే ఆల్ఫాన్సా, ఇమామ్ పసంద్, బంగినపల్లి మామిడి పండ్ల రుచి తీయదనం మరెక్కడ దొరకదన్నారు...

        ఎలాంటి రసానాలు లేకుండా కేవలం పశువుల ఎరువుతో పండించే ఆర్గానిక్ వరికి విపరీతమైన డిమాండ్ సృష్టించారు....

        అది ఆ నేల మాహత్యమే.... ఆ నీళ్లు మాహత్యమే గానీ ఆ ఎస్టేట్ లో పెరిగిన పచ్చగడ్డి కూడా పరిమళించేది ! సంవత్సరం పొడవునా నీళ్లు....

        సమస్యలు లేని వూరు....

        పాతికేళ్లుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా సాగిపోతున్న ప్రయాణంలో ఇప్పటికీ ప్రశ్నలు....

#  #  #  #

        "కరెక్ట్ సర్....

        మనం ఏమి ఇచ్చామని... వూరు, వూరంతా అర్దరాత్రి కదిలి వచ్చి ప్రాణాలు కూడా లెక్కచేయకుండా మంటలు ఆర్పడానికి ముందుకు వచ్చింది....

        ఆ మంటలు అదుపుతప్పి తోటల మీదకు వస్తే.... పరిస్థితి ఎలా ఉండేది....?

        ఎదురుగా నిల్చుని సూర్యా ప్రశ్నిస్తున్న భావన...

        వూరునీ,  ఎస్టేట్ నీ కలుపుకొని 3 వైపులా 200 అడుగుల వెడల్పుతో సంవత్సరం పొడువున ఏడెనిమిది అడుగుల లోతుకు తగ్గని నీటి ప్రవాహపు వాగు...

        దాన్ని దాటుకొని అవతలి ఒడ్డుకు వెళ్లగలిగితే...

        అన్ని సౌకర్యాలు ఉన్న టౌన్ కు చేరుకోవచ్చు. కేవలం వాగును దాటుకొని వెళ్లగలిగితే పాతిక కిలోమీటర్ల దూరం తగ్గిపోతుంది.

        కానీ రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి ఈ వాగు మీద వంతెన లావుదాయకం కాదు.

         పట్టుమని 200 ఓట్లు కూడా లేని వూరు కోసం కోట్లు ఖర్చుపెట్టి వంతెన కట్టడం లాంటి పనులు " పొలిటికల్లీ నాట్ వయబుల్"....!

        అందుకే పాతిక కిలోమీటర్లు ప్రయాణం చేసే స్కూళ్లకు వెళ్లే పిల్లలు లేరు. ముమ్మాటికి.... నూరు శాతం నిరక్షరాస్యత....

 

        సమయానికి వైద్యం అందుకు చనిపోయేవారు...?

         ఆ లెక్కలు చెప్పడానికి అక్షరం ముక్క వొచ్చిన వాళ్లే లేరక్కడ.

        అభివృద్ధి ఆనవాళ్లు  మచ్చకు కూడా కనిపించని ఆ వూరు నుంచైనా ఏడాదికి పది కోట్లు సంపాదించేది ?

        సమస్యలు.... అక్కడి నుంచి ఎటూ కదల్లేని ఆ వూరి జనాల నిస్సహాయతను ఆసరా చేసుకుని సంపాదించేస్తున్నానా!

        తల కాదు.... గుండెల్లో భారంగా ఉంది.... జయదేవ్ కి....

         లాప్ టాప్ స్క్రీన్ వైపు మళ్లీ చూశాడు.... మిగిలిపోయిన అక్షరాల వెంట కళ్లు తిరిగి ప్రయాణం ప్రారంభించాయి...

#  #  #  #

         సర్.... తరం మారిపోతుంది.

        బహుశా మీరు ఈ పొలాలు కొన్నప్పుడు యువకులుగా ఉన్న వూరి వాళ్లంతా ఇప్పుడు ముసలి వాళ్లు అయిపోయారు. అప్పుడు వాళ్లు పని చేశారు ఇప్పుడు వాళ్ల పిల్లలు పనిచేస్తున్నారు. బహుశా రేపు వాళ్ల పిల్లలు పనిచేయవచ్చు. మన ఆదాయం పది కాదు.... ఇరావై... వంద కోట్లకు చేరవచ్చు. కానీ మనతోపాటు తర తరాలుగా పని చేస్తున్న మన పక్కనున్న మనిషి కూడా ఎదగాలి సర్....

        ఆ పిల్లలు చదువులు గురించి...  ఆ వూరికి కావలసిన కనీస సౌకర్యాలు గురించి ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించండి. రేపు ఈ జనమే మనకు బలమవుతారు. మీరు ఈ రోజు అందించే విజ్ఞానమే రేపు వెలకట్టలేని సంపద అవుతుంది. మిమ్మల్ని మించిన కుబేరుడు ఎవరు ఉండకపోవచ్చు.... అప్పుడు మీరు అనుభవించే సంతోషం ఏ లెక్కలకు అందకపోవచ్చు....

#  #  #  #

         పది రోజుల క్రితం సూర్య చేసిన మెయిల్ ఇది ఆరోజు జయదేవ్ కి చదవాలని కూడా అనిపించలేదు. అతి కష్టం మీద చదివాక చిర్రేత్తుకొచ్చింది. ఆఫ్టరాల్.... ఒక మేనేజర్ కి ఇలాంటి సలహాలు ఇచ్చేంత ధైర్యమా అని... అందుకే మూడు నాలుగు రోజుల క్రితం ఈ ఎస్టేట్ కి వెళ్లి వార్నింగ్ ఇచ్చి మరి వచ్చాడు జయదేవ్...

        " నీ లిమిట్స్ క్రాస్ చేయవద్దు.... లేదా ప్యాక్ యువర్ బ్యాగేజ్... " అని. అలాంటిది ఈ పూట సూర్య మాటలు....

        చీకటి తోటలోకి వెలుతురు ప్రసరిస్తున్నట్లుగా మెల్లగా.... చీకటి కరిగి పోతుంది !

        సూర్య చెప్పింది నిజమేనా....

        నేను నేలని, నీటిని.... మొక్కల్ని మాత్రమే ప్రేమిస్తున్నానా?

        మనుషుల్ని ప్రేమించడం మర్చిపోయానా....

        మానవ సంబంధాలను విస్మరించేస్తున్నానా....

        సూర్య మాటలు గుండెల్లోంచి గొంతులోకి వచ్చి తనని బిక్కిరి బిక్కిరి చేస్తున్న భావన కలుగుతుంది జయదేవ్ కి...

        ఏదో తెలియని అస్థిమితం... ఇంకా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదని ఆరాటం....

        లాప్ టాప్ ని ముందుకు జరుపుకొని టైపు చేయడం మొదలు పెట్టాడు....

        "థాంక్యూ సూర్యా...

        ఇది మన భూమి....

        ఇది మన వూరు...."

        రెండు వాక్యాలు సూర్యకు పంపించిన జయదేవ్ కి ప్రశాంతంగా ఉంది !.

#  #  #  #

Post a Comment

0 Comments

# popcash add code popcash add code copy peste block code copy peste block code